V6 News

ఐటీలో మరోసారి లేఆఫ్స్ కలకలం.. 30 వేల మందిని తీసేస్తున్న ఒరాకిల్‌‌

ఐటీలో మరోసారి లేఆఫ్స్ కలకలం.. 30 వేల మందిని తీసేస్తున్న ఒరాకిల్‌‌

టెక్ కంపెనీ ఒరాకిల్‌‌ 20 వేల నుంచి 30 వేల మందిని తీసేస్తామని ప్రకటించింది. అమెరికా, భారత్‌‌, కెనడా, లాటిన్‌‌ అమెరికా ప్రాంతాల్లోని ఉద్యోగులను తొలగించనుంది. ఏఐ ఆధారిత ఆటోమేషన్‌‌ పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

న్యూఢిల్లీ: ఇది వరకే వేలాది మందిని తీసేసిన టెక్ కంపెనీ ఒరాకిల్‌‌‌‌ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. గ్లోబల్‌‌‌‌గా 20 వేల నుంచి 30 వేల మందిని తీసేస్తామని ప్రకటించింది.   అమెరికా, భారత్‌‌‌‌, కెనడా, లాటిన్‌‌‌‌ అమెరికా ప్రాంతాల్లోని ఉద్యోగులను తొలగించనుంది.  ఏఐ ఆధారిత ఆటోమేషన్‌‌‌‌ పెరుగుతున్నందున,  ఖర్చులను తగ్గించేందుకు వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను  తగ్గించుకుంటోంది. 

కాగా, ఏఐ వాడకం పెరుగుతుండడంతో కంపెనీలు  జూనియర్లతో పాటు  సీనియర్‌‌‌‌ ఉద్యోగులును కూడా తీసేస్తున్నాయి.  ఎక్కువ జీతాలు పొందుతున్నవారిని ఏఐ, తక్కువ జీతం తీసుకునే యువ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నాయి. ఇటీవల మెటా, మైక్రోసాఫ్ట్‌‌‌‌, డిస్నీ, ఏఎస్‌‌‌‌ఎంఎల్‌‌‌‌ వంటి కంపెనీలు  మొత్తం 20 వేల మందిని తొలగించాయి.