న్యూఢిల్లీ: ‘ఇండియా ఏఐ సమిట్’లో గురువారం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రసంగించలేదు. బిల్ గేట్స్ స్పీచ్ ఇవ్వబోరని ‘గేట్స్ ఫౌండేషన్’ అంతకుముందే ప్రకటించింది. వివాదాస్పద జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు బయటకు రావడంతో దుమారం రేగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్ గేట్స్ స్థానంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధిగా ఆఫ్రికా, ఇండియా కార్యాలయాల ప్రెసిడెంట్ అంకుర్ వోరా ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది.
