రాహుల్ అలా.. థరూర్ ఇలా.. ఏఐ సమిట్‌పై భిన్న వైఖరి

రాహుల్ అలా.. థరూర్ ఇలా.. ఏఐ సమిట్‌పై భిన్న వైఖరి

న్యూఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సమిట్ ​చాలా బాగుందని కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రశంసించారు. మొదటి రెండు రోజులు చాలా గొప్పగా సాగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘‘అస్తవ్యస్తమైన ప్రదర్శన’’ అని, అక్కడ చైనీస్ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో థరూర్​ఈ వ్యాఖ్యలు చేశారు.

 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ నాయకులు కూడా ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విమర్శించారు. నిర్వహణలో లోపాల వల్ల దేశానికే అవమానం కలిగిందని వారు అన్నారు. కాగా, గురువారం నారాయణ గురు గురించిన రాసిన తన కొత్త పుస్తకం లాంచ్ ఈవెంట్ తర్వాత థరూర్ మీడియాతో మాట్లాడారు. కొన్ని గొప్ప గొప్ప ఈవెంట్లు నిర్వహిస్తున్నప్పుడు కొన్ని లోపాలు సంభవించడం సహజమని ఆయన పేర్కొన్నారు.