అమ్మ పై భక్తి : జయలలిత సమాధి దగ్గర జరిగిన పెళ్లి

అమ్మ పై భక్తి : జయలలిత సమాధి దగ్గర జరిగిన పెళ్లి

శుభకార్యాలు, పెళ్లిళ్లు లాంటివి కొందరు తమకు ఇష్టమైన వ్యక్తుల చేతుల మీదుగా.. వారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటారు. అలాంటి అభిమానాన్నే చాటుకున్నాడు ఓ వ్యక్తి. తన కొడుకు పెళ్లిని తమిళనాడు దివంగత సీఎం జయలలిత సమాధి ఎదుట జరిపించాడు.

అమ్మపై తనకున్న భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు AIADMK పార్టీ నేత ఎస్ భవానీ శంకర్. తన కుమారుడు సాంబశివరామన్ వివాహాన్ని దీపిక అనే యువతితో నిశ్చయించాడు. అమ్మ స్మారక స్థూపాన్ని పెళ్లి వేదికగా చేసుకుని.. సంప్రదాయబద్ధంగా మ్యారేజ్ జరిపించారు. అమ్మ ఆశీర్వాదం తన కొడుకు, కోడలికి ఉండాలన్న ఉద్దేశంతోనే పెళ్లిని ఇక్కడ జరిపించానని తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత సమాధిని పూలతో అందంగా అలంకరించారు. వధూవరులను ఆశీర్వదించేందుకు అన్నా డీఎంకే నేతలు, పలువురు ప్రముఖులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.