చందా దేవో.. దందా కరో.. ప్రధాని మోడీపై ఏఐసీసీ చీఫ్​ ఖర్గే ఫైర్

చందా దేవో.. దందా కరో.. ప్రధాని మోడీపై ఏఐసీసీ చీఫ్​ ఖర్గే ఫైర్

చందా దేవో.. దందా కరో ఇది ప్రధాని మోదీ నినాదమని, లోక్‌ ఎన్నికల ప్రసంగాల్లో ప్రధాని మోదీ విద్వేషాలు రెచ్చగొట్టారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో బీజేపీ సరైన తీర్పు ఇచ్చారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే మంగళసూత్రాలు అమ్మేస్తారని మోదీ తప్పడు ప్రచారం చేశారని చెప్పారు.

ప్రధాని స్థాయిలో ఉండి విద్వేష ప్రసంగాలు చేయటం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం ప్రజాస్వామ్యానికే అవమానమని మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్టు చేశారని, ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఇరికించారని విమర్శించారు. జార్ఖండ్  సీఎం హేమంత్ సోరేన్ పై అక్రమ కేసులు బనాయించారని అన్నారు.

మోదీ సినిమాలో అన్నీ లీకేజీలోనని, మూడేండ్లలో 70 సార్లు పేపర్ లీకైందని విమర్శించారు. అయోధ్య గుడిలోనూ లీకేజీలు బయటపడ్డాయని ఎద్దేవా చేశారు. విపక్షాలను అణగదొక్కడం మోదీకి అలవాటైందని, ఇందుకోసం దర్యాప్తు సంస్థలను పావుల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు.