విశ్వ కర్మలను అవమానిస్తారా?

విశ్వ కర్మలను అవమానిస్తారా?
  • కేటీఆర్​పై మండిపడ్డ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: త్యాగాలు మావి, భోగాలు మీవి అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మంత్రి కేటీఆర్​పై మండిపడ్డారు. బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారిపై ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రవణ్ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. చారీలు పప్పులు కాదు నివురుగప్పిన నిప్పులు.. సమాజ సంస్కృతి నిర్మాతలన్నారు. పోరాటానికి, తిరుగుబాటుకు, త్యాగాలకు మారుపేర్లని  ట్వీట్ చేశారు.