జనవరి 25 నుంచి.. ఐద్వా మహాసభలు

జనవరి 25 నుంచి.. ఐద్వా మహాసభలు

ముషీరాబాద్, వెలుగు: జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాద్ లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరుగనున్న ఐద్వా 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఈనెల 25న బస్ భవన్ ప్రక్కన గ్రౌండ్​లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

సోమవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఐద్వా ఉద్యమిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణజ్యోతి, సహాయ కార్యదర్శులు కేఎన్ ఆశాలత, బుగ్గవీటి సరళ, ఐద్వా నాయకులు లక్ష్మమ్మ, పద్మ, రజిత, ఇందిర, కవిత తదితరులు పాల్గొన్నారు.