ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎయిర్​ఫోర్స్​ జాబ్​

ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎయిర్​ఫోర్స్​ జాబ్​

అగ్నివీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయులో సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో పోస్టులకు అప్లై చేసుకున్నవారు నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాళీలకూ పోటీ పడొచ్చు. ఇందుకోసం వీరు స్పెషల్​ ఎగ్జామ్​ రాయాలి.

సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇంటర్మీడియట్​లో మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా నిర్దేశిత బ్రాంచీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి. లేదా ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టులతో రెండేళ్ల ఒకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 

నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఏదైనా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా రెండేళ్ల ఒకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏ అర్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పది/ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ ఒకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి.

ఫిజికల్​ మెజర్​మెంట్​: అన్ని విభాగాలకూ పురుషులు 152.5 సెం.మీ. మహిళలు 152 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు అవసరం. శ్వాస పీల్చినప్పుడు, వదిలినప్పుడు 5 సెం.మీ. వ్యత్యాసం తప్పనిసరి.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: పరీక్ష మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి ఫేజ్​లో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సెలెక్ట్​ అయితే రెండో ఫేజ్​లో ఫిజికల్​ మెజర్​మెంట్. అడాప్టబిలిటీ పరీక్ష​ ఉంటుంది. మూడో ఫేజ్​లో సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ ఉంటుంది. 

రాతపరీక్ష: ఇందులో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో ఉంటాయి. క్వశ్చన్​ పేపర్ ఇంగ్లీష్, హిందీ మీడియంలో ఉంటుంది. సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టులకు గంట సమయం కేటాయిస్తారు. ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారికి 45 నిమిషాల సమయం ఉంటుంది. ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండింటికీ అప్లై చేసుకున్న అభ్యర్థులకు 85 నిమిషాల సమయం ఉంటుంది. ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అన్ని పరీక్షల్లోనూ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు జవాబుకూ పావు మార్కు తగ్గిస్తారు. ఎంచుకున్న పరీక్షను బట్టి ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25, రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 ప్రశ్నలు అడుగుతారు.

ప్రిపరేషన్​: మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో ప్రశ్నలకు ఎంసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలో ప్రిపేర్​ అవ్వాలి. ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాఠ్యపుస్తకాల్లోని గ్రామర్​పై ఫోకస్​ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మీడియం రేంజ్​ ప్రశ్నలు అడుగుతారు. జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రశ్నలకు ఇటీవలి కాలంలో రక్షణ విభాగంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలకు ప్రాధాన్యమివ్వాలి. క్రీడలు, అవార్డులు, విజేతలు, పుస్తకాలు, రచయితలు, నియామకాలు, ఎన్నికలు తదితర కరెంట్​ ఎఫైర్స్​ మీద దృష్టి పెట్టాలి. ప్రీవియస్​ పేపర్స్ ప్రాక్టీస్​ చేస్తే మంచి స్కోర్​ సాధించవచ్చు.  

ఫిజికల్​ ఫిట్​నెస్​ పరీక్ష : రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులు సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రాలకు అవసరమైన సర్టిఫికెట్లతో హాజరవ్వాలి. ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని పురుషులు 7, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. పురుషులు ఒక్కోటీ నిమిషం వ్యవధిలో.. 10 పుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 10 సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 20 స్క్వాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయాలి. మహిళలు 90 సెకన్లలో 10 సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అప్స్​, నిమిషంలో 15 స్క్వాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి.  వీటన్నింటిలోనూ అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు-1 నిర్వహిస్తారు. అభ్యర్థి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగానికి సరిపోతాడో లేదో తెలుసుకోవడానికి ఆబ్జెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు 2 ఉంటుంది. ఈ స్టేజ్​లో వాయుసేన వాతావరణానికి అభ్యర్థి అలవాటు పడగలడా లేదా అని పరిశీలిస్తారు.

మెడికల్​ టెస్ట్:  అడాప్టబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించినవారిని మెడికల్​ పరీక్షలు నిర్వహించి ట్రైనింగ్​, నాలుగేళ్ల విధుల నిమిత్తం తీసుకుంటారు.

అగ్నివీర్​ బెనిఫిట్స్​ 

ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి జమ చేస్తారు. మొదటి ఏడాది ప్రతి నెల పొందే 30,000 నుంచి రూ.9000 మినహాయిస్తారు. అగ్నివీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయు చేతికి రూ.21,000 అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,500 చేతికి వస్తుంది. రూ.10,950 నిధికి వెళ్తుంది. ఇలా నాలుగో ఏడాదికి వచ్చే సరికి వీరునికి రూ.28,000, నిధికి రూ.12,000 వెళ్తాయి. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి జమవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జత చేస్తుంది. రెండూ కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డీని జతచేసి, అగ్నివీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయుకి అందిస్తారు. రిటైర్​మెంట్​ అనంతరం కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయి.

నోటిఫికేషన్​ 

వయసు: డిసెంబరు 26, 2002 - నుంచి జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 26, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు
దరఖాస్తులు:  అర్హులైన అభ్యర్థులు మార్చి 31 నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు: రూ.250 చెల్లించాలి.
ఎగ్జామ్స్​: మే 20 నుంచి పరీక్షలు 
నిర్వహిస్తారు.
వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: www.agnipathvayu.cdac.in

ఉద్యోగం చేస్తూ చదవొచ్చు

నాలుగేళ్లు పూర్తిచేసుకున్న అగ్నివీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయు ఒక్కో బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గరిష్టంగా 25 శాతం మందిని ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందుకోసం నాలుగేళ్లలో చూపిన ప్రతిభ, సంస్థ అవసరాలు ప్రామాణికంగా తీసుకుంటారు. సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో అవకాశం వచ్చినవారు గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) విధులు నిర్వర్తిస్తారు. నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వై(టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సేవలు అందిస్తారు. ఈ రెండు ట్రేడులవారికీ డీఏ, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎ, ఇతర అలవెన్సులు అందుతాయి. ప్రమోషన్ల ద్వారా మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎండబ్ల్యువో) స్థాయి వరకు చేరుకోవచ్చు. సర్వీసులో కొనసాగుతూ కొన్ని పరీక్షల్లో అర్హతలు సాధిస్తే కమిషన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్​ కావడానికీ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్య చదవడానికి అనుమతిస్తారు.

ప్రోత్సాహకాలు 

నాలుగేళ్ల సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలవెన్సులు అందిస్తారు. వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యను బట్టి సిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్తిస్తుంది. అగ్నివీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయులో అవకాశం వచ్చినవారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30,000 చెల్లిస్తారు. రెండో సంవత్సరం నెలకు రూ.33,000 వేతనం ఉంటుంది. మూడో ఏడాది రూ.36,500 అందుతుంది. నాలుగో సంవత్సరం రూ.40,000 ప్రతి నెలా చెల్లిస్తారు. నాలుగేళ్ల సేవలకు గానూ వారు పనిచేసిన విభాగాన్ని అనుసరించి అగ్నివీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయు స్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుతుంది.