ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..అత్యవసరం ల్యాండింగ్

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..అత్యవసరం ల్యాండింగ్

కాలికట్ నుంచి దోహా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం (జూలై23) కాలికట్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ (IX375) సాంకేతిక లోపంతో కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తిరిగి అత్యవసర ల్యాండింగ్ అయింది. 

ఫ్లైట్ లో క్రూజ్ సిబ్బందితో సహా మొత్తం188మంది ప్రయాణికులున్నారు. కాలికట్ నుంచి 9.15 గంటలకు బయల్దేరిన విమానం..11.12 గంటల ప్రాంతంలో తిరిగి కాలికట్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ అయింది. క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో లోపం వల్ల భద్రతా చర్యగా అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.

ALSO READ | పోలీస్ కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి నో ఛాన్స్.. అమ్మాయిని వేధించిన కేసున్నా..

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ..మా విమానం ఒకటి సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన తర్వాత కేరళలోని కోజికోడ్‌కు తిరిగి వచ్చిందని అన్నారు. ప్రయాణీకులందరినీ సురక్షితంగా దింపారు.విమానాశ్రయంలో ప్రయాణికులకు ఆహారం ఏర్పాట్లు చేశారు.

అయితే అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి ఎయిర్‌లైన్ కృషి చేస్తోందన్నారు ఎయిర్ ఇండియా ప్రతినిధులు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశామన్నారు.