ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. ప్రయాణికుల ఆగ్రహం..

ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. ప్రయాణికుల ఆగ్రహం..

ప్రయాణికుల పట్ల ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుంది. విజయవాడ నుండి బెంగళూరు వెళ్లిన విమానంలో తీసుకెళ్లిన లగేజీని బెంగళూరులో ప్రయాణికులకు అప్పజెప్పటంలో ఎయిర్ ఇండియా సిబ్బంది విఫలమయ్యింది. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు సిబ్బందిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం ఇచ్చారు. కొద్దిసేపు రచ్చ జరిగిన తర్వాత అసలు విషయం బయటపెట్టారు సిబ్బంది.

గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన విమానానికి సంబందించిన లగేజీని బెంగళూరుకు చేర్చకుండా అక్కడే వదిలేశారని తెలిసింది. ఈ ఘటన బెంగళూరు అయిర్పోర్టులో కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రయాణికుల లగేజి గన్నవరం అయిర్పోర్టులోనే మిస్ అయ్యిందని కాసేపట్లో ప్రయాణికులకు అప్పగిస్తామని సిబ్బంది నచ్చజెప్పారు. కాగా, ఎయిర్ ఇండియా సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిర్ లైన్స్ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు.