ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం: రెండు రోజులు స్కూళ్లకు సెలవు

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం: రెండు రోజులు స్కూళ్లకు సెలవు

న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం డేంజర్ లెవల్​కు చేరింది. గురువారం సివియర్ కేటగిరీలో ఉన్న ఎయిర్ క్వాలిటీ.. శుక్రవారం నాటికి సివియర్ ప్లస్ కేటగిరీకి పడి పోయింది. గురువారం 10 గంటలకు 351గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ).. శుక్రవారం ఉదయం 9గంటలకు 471గా నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటింది. లోధి రోడ్డు, జహంగీర్ పురి, ఆర్కే పురం, ఎయిర్ పోర్టు ప్రాంతాల్లో తీవ్రమైన కాలుష్యం కారణంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. 

కాలుష్యం కారణంగా రెండ్రోజుల పాటు ప్రైమరీ స్కూళ్లను బంజేస్తూ ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ బార్డర్ లోని హర్యానా, పంజాబ్, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లోని సిటీల్లోనూ ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. కాగా, గాలి కాలుష్యం ఒక్క ఢిల్లీలోనే లేదని, అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమస్య ఉందని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, అసలు కేంద్ర పర్యావరణ శాఖ ఉన్నదా అని విమర్శించారు.