వెంకీతో జోడిగా ఐశ్వర్య రాయ్.. ఆ సెంటిమెంట్​తోనే ఛాన్స్ మిస్

వెంకీతో జోడిగా ఐశ్వర్య రాయ్.. ఆ సెంటిమెంట్​తోనే ఛాన్స్ మిస్

ఐశ్వర్యా రాయ్ ఇప్పటివరకు ప్రియురాలు పిలిచింది, జీన్స్ చిత్రాల్లో నటించింది. కానీ అవన్ని తమిళ్ నుంచి డబ్ చేసినవే. ఇప్పటివరకు ఐశ్వర్యా రాయ్ ఒక్క తెలుగు సినిమాలో నటించలేదు. అప్పుడెప్పుడో నాగార్జున నటించిన రావోయి చందమామ చిత్రంలోని ఓ సాంగ్ లో మెరిసింది. 1997లో వచ్చిన వెంకటేశ్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలో ఐశ్వర్యా రాయ్ ని హీరోయిన్ గా పెట్టాలని దర్శకుడు జయంత్ సి పరాన్జీ అనుకున్నారట. కానీ అప్పటికే ఆమె చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. దీంతో ఫెయిల్యూర్ హీరోయిన్ గా ఐశ్వర్యకు ముద్రపడింది.

ఆ సెంటిమెంట్ వల్లే దర్శక నిర్మాతలు ఆమెను తెలుగు సినిమాలోకి తీసుకునే సాహసం చేయలేకపోయారట. దీంతో ఐశ్వర్యా రాయ్ ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేకపోయింది.  అయితే అంజలా జవేరీ ప్రేమించుకుందాం రా సినిమాతో హిట్టు కొట్టేసింది.