మిడిల్ క్లాస్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్ అయ్యే..మ్యూజిక్ షాప్ మూర్తి

మిడిల్ క్లాస్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్ అయ్యే..మ్యూజిక్ షాప్ మూర్తి

పలు చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్న అజయ్ ఘోష్ టైటిల్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి, రంగారావు నిర్మించారు. చాందిని చౌదరి హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించగా, భాను చందర్, ఆమని కీలక పాత్రలు పోషించారు. శనివారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అజయ్ భూపతి సినిమా సక్సెస్ అవ్వాలని బెస్ట్ విషెస్ చెప్పాడు.

అజయ్ ఘోష్  మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఒక జీవితం కనిపిస్తుంది. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ.  ఇందులో నేను హీరో కాదు. కథే హీరో. మేం మా పాత్రలను పోషించామంతే. అందర్నీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’ అని అన్నాడు. ఈ చిత్రం  మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌కి బాగా కనెక్ట్ అవుతుందని చాందినీ చెప్పింది.

మెసేజ్ ఇచ్చే చిత్రమిది అన్నారు భాను చందర్.  మంచి కథను ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం అని దర్శక నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.