
కోలీవుడ్ సూపర్ స్టార్ తల అజిత్ కుమార్ ప్రస్తుతం తన 61వ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. అజిత్ ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమా టైటిల్‌ను ఇవాళ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘తునివు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘నో గట్స్ నో గ్లోరీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ ఫస్ట్ లుక్ లో అజిత్ గన్ పట్టుకుని కుర్చీలో రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది.
ఈ పోస్టర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, బోనీ కపూర్,జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న రెండవ సినిమా ఇది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.