న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్(ఆర్సీ)గా అద్వైత్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) సోమవారం పూర్తి అదనపు బాధ్య తలను (ఎఫ్ఏసీ) స్వీకరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కో ఆర్డినేషన్ (కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథ కాలు) స్పెషల్ సెక్రటరీగా ఆయన ఢిల్లీలో సేవ లందిస్తున్నారు.
ఇప్పటి వరకు భవన్ ఆర్సీగా పని చేసిన శశాంక్ గోయల్ గత నెల 30న పదవి విరమణ చేశారు. దీంతో ఆర్సీ పదవికి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సింగ్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
