
Akash Ambani : రిలయన్స్ గ్రూప్ టెలికాం వ్యాపార విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ అకాశ్ అంబానీ. అంబానీ పెద్ద కుమారుడైన ఆకాష్ ఈ కంపెనీ పగ్గాలు అందుకున్న తర్వాత యూజర్లను పెంచటంతో పాటు అనేక ఇతర సేవల్లోకి జియోను విస్తృతంగా విస్తరించటం జరిగింది. దేశంలో 50 కోట్ల మంది యూజర్లు కలిగిన కంపెనీగా జియోను కేవలం దశాబ్ధకాలం కంటే తక్కువలోనే రూపాంతరం చెందేలా చేయటం వెనుక జరుగుతున్న టెక్ మ్యాజిక్ క్రెడిట్ అంబానీ కుటుంబానికి దక్కింది.
ఇవాళ (ఆగస్టు 29న) జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంలో రెండు విప్లవాత్మకమైన డిజిటల్ సొల్యూషన్స్‌ను ప్రకటించారు ఆకాష్ అంబానీ. వాటిలో ఒకటి JioPC. ఈ జియోపీసీ పూర్తిగా క్లౌడ్ ఆధారిత వర్చువల్ కంప్యూటర్ సర్వీస్. ఇక రెండవది JioFrames. భారతదేశంలోని ప్రజల అవసరాల కోసం డిజైన్ చేయబడిన ఏఐ పవర్డ్ వేరబుల్ ఎకోసిస్టమ్ జియోఫ్రేమ్స్.
జియోపీసీ ఎలా పనిచేస్తుంది:
ప్రజలు తమ ఇంట్లోని టీవీనే కంప్యూటర్‌గా మార్చుకునేందుకు తమ జియోపీసీ సేవలు ఉపయోగపడతాని ఆకాష్ అంబానీ వెల్లడించారు. టీవీ స్క్రీన్ ఏదైనా నిమిషాల్లో దానిని ఏఐ రెడీ కంప్యూటర్ గా మార్చేందుకు జియోపీసీ టెక్నాలజీ దోహదపడుతుందని చెప్పారు ఆకాష్. ఇందుకోసం ప్రత్యేక కంపప్యూటర్ అక్కర్లేదని సాధారణ కీబోర్డును తమ జియో టీవీ సెట్ టాప్ బాక్సుకు కనెక్ట్ చేస్తే సరిపోతుందని చెప్పారు అంబానీ. దీంతో వర్చువల్ కంప్యూటర్ ఆన్ అవుతుందని ఎక్కడినుంచైనా దీనిని వినియోగించవచ్చని చెప్పారు ఆకాష్.
ఇది పూర్తిగా క్లౌడ్ సాంకేతికతతో పనిచేస్తుందని అందువల్ల ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా.. సబ్ స్క్రిప్షన్ మోడల్ కింద వాడుకున్న దానికి పేమెంట్ చేయెుచ్చని చెప్పారు ఆకాష్ అంబానీ. జియోపీసీ ద్వారా యూజర్లు స్టోరేజ్, మెమరీ, ప్రాసెసింగ్ పవర్ అన్నీ రిమోట్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ, ఆన్‑డిమాండ్ అప్‌డేట్స్ కూడా ఇందులో ఉంటాయి.
జియోఫ్రేమ్స్:
జియోఫ్రేమ్స్ అనేది ప్రత్యేకంగా భారత్ కోసం డిజైన్ చేసిన AI వేరబుల్ ఎకోసిస్టమ్. ఇందులో భారతీయ భాషలకు అనుకూలమైన మల్టీలింగ్వల్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. వినియోగదారులు వాయిస్ ద్వారా డైరెక్ట్‌గా పరికరాన్ని ఆపరేట్ చేయవచ్చు. హెచ్‌డి ఫొటోలు తీయెుచ్చు, వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు అలాగే లైవ్ కి కూడా వెళ్లొచ్చని ఆకాష్ చెప్పారు. ఈ డేటా మెుత్తం జియోఏఐ క్లౌడ్‌లో ఆటోమేటిక్‌గా స్టోర్ అవుతాయి.