బషీర్బాగ్, వెలుగు: తురగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో ఆకాశవాణి న్యూస్ రీడర్ల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. గత 60 ఏండ్ల కాలంలో ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ కేంద్రాల నుంచి తెలుగులో జాతీయ, ప్రాంతీయ వార్తలు చదివిన ఆరు తరాల న్యూస్ రీడర్లు, అనువాదకులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఆకాశవాణి విశ్రాంత ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. దేశ విదేశీ భాషల్లో వార్తా ప్రసారాలు, సంగీత, సాహిత్య, విద్యా, వైజ్ఞానిక కార్యక్రమాలు అందించడంలో ఆకాశవాణి సేవలు అనితర సాధ్యమని కొనియాడారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జె. చెన్నయ్య, కందుకూరి సూర్యనారాయణ, ప్రయాగ రామకృష్ణ, ఓలేటి పార్వతీశం, కొంగర జగ్గయ్య, అద్దంకి మన్నార్ పాల్గొన్నారు.
