కొత్తగూడెంలో 90 వసంతాల ఆకాశవాణి వేడుకలు

కొత్తగూడెంలో 90 వసంతాల ఆకాశవాణి వేడుకలు

చుంచుపల్లి, వెలుగు :  ఆకాశవాణి 90వ వార్షిక వేడుకల్లో భాగంగా శుక్రవారం కొత్తగూడెంలో 3కే వాకథాన్​ నిర్వహించారు. చుంచుపల్లి మండలంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి. భరత్ జెండా ఊపి ప్రారంభించారు. రేడియో స్టేషన్ నుంచి ప్రారంభమైన వాకథాన్​ 14వ నంబర్ ఏరియా, రామవరం సెంటర్, 2టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తిరిగి రేడియో స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. +

ఈ సందర్భంగా స్టేషన్ ప్రోగ్రామ్ హెడ్ కొలిపాక శంకరరావు మాట్లాడుతూ.. 1936లో ప్రారంభమైన ఆకాశవాణి నేటికీ గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు విశ్వసనీయ సమాచార వేదికగా కొనసాగుతోందన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్, నూర్వి రాజశేఖర్, ఎం. బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు.