నా హెలికాప్ట‌ర్ టేకాఫ్ కు ఎందుకు అనుమ‌తించ‌లేదు

V6 Velugu Posted on Jan 28, 2022

స‌మాజ్ వాదీ పార్టీ (SP)అధ్య‌క్షులు అఖిలేశ్ యాద‌వ్ బీజేపీపై తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ కు హెలికాప్ట‌ర్ లో వెళ్లేందుకు సిద్ద‌మైతే త‌న హెలికాప్ట‌ర్ టేకాఫ్ కు అనుమ‌తించలేద‌ని తన ట్విట్టర్ వేదికగా  అఖిలేశ్ యాద‌వ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ ఓటమి కుట్రగా ఆయన చెప్పారు.

ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు హెలికాప్టర్ లో వెళ్లేందుకు అఖిలేష్ యాదవ్ రెడీ అయ్యారు. కానీ తన హెలికాప్టర్ టేకాఫ్ కు అనుమతించలేదని ఆరోపించారు. బీజేపీకి చెందిన ఓ నాయకుడికి అదే ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో వెళ్లడానికి అనుమతించారని తెలిపారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ట్వీట్ చేశారు. ఎంత చేసినా.. 2022 లో జరిగే ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించడం ఖాయమని అఖిలేశ్ యాద‌వ్ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం...

ప్రాంతీయ పార్టీల ఆస్తుల్లో సెకండ్ ప్లేస్‌లో టీఆర్ఎస్

Tagged muzaffarnagar, Akhilesh Yadav, alleges, Helicopter Stopped, Taking Off, Cries Conspiracy

Latest Videos

Subscribe Now

More News