ప్రాంతీయ పార్టీల ఆస్తుల్లో సెకండ్ ప్లేస్‌లో టీఆర్ఎస్

V6 Velugu Posted on Jan 28, 2022

ఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయంగానే కాదు.. ఆర్థికంగానూ బలపడుతోంది. దేశంలో బీజేపీకి అత్యధికంగా రూ. 4,847.78కోట్ల మేర ఆస్తులున్నట్లు వెల్లడైంది. 2019 – 20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని 7 జాతీయపార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్.. ఏడీఆర్ వెల్లడించింది. జాతీయపార్టీల్లో బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 ఆస్తులు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ నిలిచింది. ఆ పార్టీకి 698.33కోట్ల ఆస్తులున్నట్లు రిపోర్టులో వెల్లడైంది. ఇక 588.16 కోట్ల విలువైన ఆస్తులతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంది. జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో బీజేపీ వాటా 69.37శాతం ఉన్నట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాలు, ముందస్తు చెల్లింపులు, పెట్టుబడులు తదితర వివరాల ప్రాతిపదికన ఈ ఆస్తుల విలువ లెక్కగట్టారు.
టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్
ప్రాంతీయ పార్టీల్లో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ పార్టీకి అత్యధికంగా రూ.563.47కోట్ల ఆస్తులున్నట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది.  రెండోస్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఉంగా.. దాని ఆస్తుల మొత్తం విలువ రూ.301.47 కోట్లు. 267.61 కోట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచింది. 
అప్పుల్లో కాంగ్రెస్ టాప్
అప్పుల విషయంలో జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ కు అత్యధికంగా రుణాలున్నాయి. ఆ పార్టీకి రూ. 49.55కోట్ల అప్పులున్నట్లు ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. రూ. 11.32 కోట్ల రుణాలతో తృణమూల్ కాంగ్రెస్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ప్రాంతీయ పార్టీల్లో 30.34 కోట్ల అప్పులతో టీడీపీ టాప్ ప్లేస్ లో ఉండగా.. 8.05 కోట్ల రుణాలతో డీఎంకే రెండోస్థానంలో ఉంది. 

For more news..

బ్రహ్మోస్‌ మిస్సైల్ ఎగుమతికి భారత్‌కు తొలి ఆర్డర్

ఎన్సీసీ పరేడ్‌లో ప్రధాని మోడీ న్యూ లుక్

 

 

 

Tagged Bjp, TRS, Congress, assets, National, SP, Political parties, richest, adr survey

Latest Videos

Subscribe Now

More News