Akshaya Tritiya 2023: బంగారం, వెండి, వజ్రాల కొనుగోలుపై ఆఫర్‌లు, తగ్గింపులు

Akshaya Tritiya 2023:  బంగారం, వెండి, వజ్రాల కొనుగోలుపై ఆఫర్‌లు, తగ్గింపులు

అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు కొనడాన్ని చాలా మంది శుభసూచకంగా భావిస్తారు. తరతరాల నుంచి చాలా మంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నందున బంగారం, వెండి కొనుగోళ్లపై ఆయా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ అక్షయ తృతీయ నాడు తాము అందించే ఆఫర్లను వినియోగించుకుని, సంతోషంగా ఉండడంటూ పలు గోల్డ్ వ్యాపారస్థులు ఇప్పటికే ప్రకటనలు మొదలుపెట్టారు. ఏప్రిల్ 22న అక్షయ తృతీయ కావడంతో జోయలుక్కాస్, తనిష్క్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాంటి ప్రముఖ కంపెనీలు ఇస్తోన్న ఆఫర్లు, డిస్కౌంట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జోయాలుక్కాస్

రూ.10వేలు అంతకంటే ఎక్కువ విలువైన వెండి ఆభరణాల కొనుగోలుపై జోయాలుక్కాస్ రూ.500 గిఫ్ట్ వోచర్‌ను ఉచితంగా అందిస్తోంది. అదనంగా  రూ. 50 లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారు, వజ్రాభరణాల కొనుగోలు చేసిన వారికి ఉచితంగా రూ. 1,000 , రూ. 2వేల గిఫ్ట్ వోచర్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్ భారతదేశంలోని అన్ని జోయాలుక్కాస్ షోరూమ్‌లు, వెబ్‌సైట్‌లోనూ చెల్లుబాటు కానుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 23, 2023 వరకు మాత్రమే వర్తిస్తుంది. బంగారం, వెండి నాణేలు/కడ్డీలకు ఈ ఆఫర్ వర్తించదు.

క్యారట్‌లేన్

క్యారెట్‌లేన్ డైమండ్స్‌పై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. అదనంగా SBI కార్డు వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌లపై 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 22, 2023 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

తనిష్క్

అక్షయ తృతీయ సందర్భంగా తనిష్క్ ... బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 20 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

PP జ్యువెలర్స్

PP జ్యువెలర్స్ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 50 శాతం తగ్గింపును అందిస్తోంది.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి రూ.30వేల కొనుగోలుపై 100 మి.గ్రా.కు సమానమైన బంగారు నాణేలను బహుమతిగా అందిస్తోంది. వీటితో పాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్‌లు తమ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 23, 2023 వరకు వర్తిస్తుంది.

మెలోర్రా

మెలోరా బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 50 శాతం వరకు తగ్గింపు, డైమండ్ ప్రాడక్ట్ వాల్యూపై 25 శాతం తగ్గింపును అందిస్తోంది. అదనంగా ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై అదనపు 2 శాతం తక్షణ తగ్గింపుతో ICICI డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తున్నారు.

కళ్యాణ్ జ్యువెలర్స్  

కళ్యాణ్ జ్యువెలర్స్ ద్వారా కాండరే డైమండ్ ఆభరణాలపై క్యాండెరే 100 శాతం జీవితకాల మార్పిడి విలువను అందిస్తోంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 23 వరకు వర్తిస్తుంది. ఇది అన్ని ప్రముఖ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా 3 శాతం తక్షణ తగ్గింపుతో పాటు బంగారం, వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 100 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.