ధరణిపై అధికారులకు శిక్షణ ఇవ్వాలె : ఆకునూరి మురళి

ధరణిపై అధికారులకు శిక్షణ ఇవ్వాలె : ఆకునూరి మురళి

ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో రైతులకు సమస్యలు వస్తే చెప్పుకోవడానికి ఎవరూ లేరని, తహశీల్దార్లకు కూడా పవర్ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ఈరోజు రైతులకు సమస్యలు వస్తే సిటీలకు వచ్చే అవసరం వచ్చిందని, దీని వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికారులకు లంచం ఇస్తే అన్ని వివరాలు మారిపోతున్నాయని, అలా కాకుండా చూడాలని కోరారు. ప్రతి గ్రామానికి గ్రామ రెవెన్యూ అధికారి ఉండాలని, దాని వల్ల గ్రామస్థాయిలోనే  పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.

ధరణి పోర్టల్ సాఫ్ట్ వేర్ పై తహశీల్దార్లకు, కలెక్టర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. భూమిపై మంచి అవగాహన ఉన్న మాజీ అధికారులతో కమిటీ వేస్తే.. సమస్య తీరుతుందన్నారు. ఈ కమిటీలో ఒక వర్కింగ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండాలని సూచించారు. 

వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ వాసవీ క్లబ్ లో ‘‘ధరణిలో మార్పు రావాలి.. భూమాత ఎలా ఉండాలి’’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి,  కరుణాకర్ దేశాయి, హైకోర్టు అడ్వకేట్ వేణుగోపాల్ హాజరయ్యారు.