పేదలకు చదువు అందొద్దని సీఎం ​దుర్మార్గ ప్రణాళిక

పేదలకు చదువు అందొద్దని సీఎం ​దుర్మార్గ ప్రణాళిక
  • రిటైర్డ్​ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్​

హైదరాబాద్, వెలుగు: పేదలకు విద్య అందొద్దనే దుర్మార్గపు ప్రణాళికను సీఎం కేసీఆర్​అమలు చేస్తున్నారని రిటైర్డ్​ ఐఏఎస్​అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్​ చేశారు. ‘‘తెలంగాణ మోడల్​ అభివృద్ధి అంటే ఇదేనా కేసీఆర్​గారూ..  రాష్ట్ర అభివృద్ధికి పునాది విద్య అనే విషయం 28 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్​కు తెలుసు. అయినా పేదలకు ఆ విద్య అందొద్దన్న దుర్మార్గపు ప్రణాళికనే ఈ పెద్ద మనిషి అమలు చేస్తున్నడు. 

తొమ్మిదేండ్లలో ఒక్క గంట కూడా విద్య మీద రివ్యూ చెయ్యని ఆయన.. బంగారు తెలంగాణ అంటూ మాట్లాడుతున్నడు. మన ఊరు, మన బడికి రూ.7,268 కోట్లు అని చెప్పి ఇప్పటికి రూ.400 కోట్లే ఖర్చు చేసిండు.  పైగా ఆయనే కేజీ టు పీజీ అంటూ దొంగ వాగ్దానాలు చేసిండు’’ అని  మురళి మండిపడ్డారు.