సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లీ కార్లోస్‌‌‌‌‌‌‌‌ దెబ్బ.. ఇటాలియన్ ఓపెన్ నెగ్గిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌

సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లీ కార్లోస్‌‌‌‌‌‌‌‌ దెబ్బ.. ఇటాలియన్ ఓపెన్ నెగ్గిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌

రోమ్‌‌‌‌‌‌‌‌: స్పెయిన్ యంగ్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్ జానిక్ సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరోసారి చెక్ పెట్టి ఇటాలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ 7-–6(5), 6–-1 స్కోరుతో సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌‌‌‌‌‌‌‌ టై బ్రేక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా.. నిలకడగా ఆడిన కార్లోస్ సెట్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌‌‌‌‌‌‌‌లో  అతను పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. మొదటి సెట్‌‌‌‌‌‌‌‌లో 6–-5 ఆధిక్యంలో ఉన్నప్పుడు రెండు సెట్ పాయింట్లు వృథా చేసుకున్న సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత పుంజుకోలేకపోయాడు.

రెండో సెట్‌‌‌‌‌‌‌‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. దాంతో  సినర్‌‌‌‌‌‌‌‌పై అల్కారజ్ వరుసగా నాలుగో విజయం అందుకున్నాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తంగా ఏడోసారి గెలిచి ముఖాముఖి రికార్డును 7–4కు పెంచుకున్నాడు. మూడు నెలల బ్యాన్‌‌‌‌‌‌‌‌ తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఫైనల్లో ఓటమితో సినర్ 26 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల విజయయాత్రకు బ్రేక్ పడింది. కాగా, ఈ విక్టరీతో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ  రెండో ర్యాంక్ అందుకోనున్నాడు.