మీకు తెలుసా : పార్టీల్లో.. మందు గ్లాసులను చీర్స్ అని ఎందుకు కొడతారు

మీకు తెలుసా : పార్టీల్లో.. మందు గ్లాసులను చీర్స్ అని ఎందుకు కొడతారు

 ఫ్రెండ్ బర్త్ డే అయినా, ఫ్రెండ్ కి లవ్ ఓకే అయినా, ఫ్రెండ్ ఎగ్జామ్స్ లో పాస్ అయినా, టాప్ రాంక్ వచ్చినా, పెళ్లి ఫిక్స్ అయినా, అదే పెళ్లి చెడిపోయినా ఇలా ఏది జరిగినా పార్టీ చేసుకోవడం మామూలైపోయింది. అయితే ఇలాంటి వారు తాగే ముందు చీర్స్ అనే ఒక పదం మాత్రం ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. అయితే ఈ పదం ఎందుకు వాడుతామని వారికి కూడా తెలిసి ఉండే అవకాశమే లేదు. అయినా ఒక రూల్ లాగా చీర్స్ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ పదం ఎందుకు అంటారు. దాని వెనుకున్న రహస్యమేమిటో ఇప్పుడు చూద్దాం.

 ఇది పాత ఫ్రెంచ్ పదం చియర్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం తల అని అనేక నివేదికల ప్రకారం తెలుస్తోంది.  ఇది 18 వ శతాబ్దం వరకు ఆనందం కోసం కూడా ఉపయోగించబడింది.  కానీ తరువాత ఇది ఉత్సాహాన్ని చూపించడానికి కూడా ఉపయోగించబడింది. అందుకే ఉత్సాహం కోసం ప్రజలు చీర్స్‌ని ఉపయోగిస్తారట.

సమాజంలో చెడు అలవాట్లలో మద్యం త్రాగడం  ఒకటని తెలిసిందే. మద్యం తాగడం హానికరం అని తెలిసి కూడా తాగడం ఆపరు అదే విధంగా మద్యం వలన నష్టాలున్నాయని తెలిసినా ప్రభుత్వాలు మద్యం అమ్మకాల్ని బ్యాన్ చేయరు. ఈ రోజుల్లో మద్యం తాగడానికి కారణాలు లేకున్నా కూడా సృష్టించుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా మద్యపానానికి బానిసలై పోయారు.

పూర్వం మధ్యయుగంలో దారి దోపిడీ దొంగలు ఎక్కువగా చేసేవారట.  అయితే వీరు విజయవంతంగా దొంగతనం చేసిన తర్వాత  ఒక దీవి వద్ద ఆగేవారట. వారంతా  అక్కడ మద్యాన్ని సేవించేవారని తెలుస్తోంది.  అయితే వారిలో వారే వారికే గిట్టని వారిని చంపడానికి ఆ మద్యంలో విషాన్ని కలిపేవారట. ఈ భయంకరమైన పద్దతిని మట్టుపెట్టడానికి వీరంతా ఒక విధానాన్ని పాటించాలని అనుకున్నారట. అందరూ మద్యాన్ని గ్లాసులలో కలుపుకుని తర్వాత తాగే ముందు చీర్స్ అని చెప్పుకునేవారట. ఇలా చేయడం వలన ఆ గ్లాసులలోని మద్యం ఒకదాని నొకటి తగిలి  ఒకరి గ్లాసులో  మద్యం  మరొకరి గ్లాసులో  పడేదట. ఇలా పడడం వలన ఒకవేళ విషం కలిపి ఉంటె అందరూ చస్తారు కదా. దానికి భయపడి ఎవ్వరూ విషం కలపరని ఈ విధానాన్ని కనుగొన్నారు. అలా అది కాలక్రమేణా దేశ దేశాలకు పాకి ప్రపంచమంతా వ్యాపించింది.

ఇది ఒక కారణం అయితే మరికొన్ని కారణాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

  • ఇంకో కారణం ఏమిటంటే మధ్య తాగడం వలన మనకున్న జ్ఞానేంద్రియాలలో కళ్ళు, ముక్కు, చర్మం మరియు నోరు ఏదో విధంగా అనుభూతి చెందుతాయి. కేవలం ఒక్క చెవులు మాత్రం అలాంటి భావన ఉండదు.  అందుకే ఇలా చీర్స్ అనే శబ్ధం చేయడం వలన చెవులు కూడా ఒక అనుభూతిని పొందుతాయట.
  • ఇలా గ్లాసులను కొట్టడం వలన మనమంతా కలిసి ఉన్నామనే భావన అందరిలో కలగడానికి ఒక యూనిటీని తెలియచేస్తుందని అంటుంటారు.
  • కొన్ని ప్రాంతాలలో అయితే ఇలా చీర్స్ చెప్పడం వలన మన చుట్టూ ఏమైనా చెడ్డ శక్తులు ఉంటే ఆ శబ్దానికి వెళ్ళిపోతాయని అనుకునే వారని చెప్పుకుంటూ ఉంటారు.  

ఈ విధంగా మద్యం తాగే సమయంలో చీర్స్ చెప్పుకోవడానికి రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకోండి. మద్యానికి దూరంగా ఉండండి.