రైల్వే సిబ్బంది అప్రమ‌త్తం  :  కొల్లాం - చెన్నై ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ కు త‌ప్పిన ముప్పు

రైల్వే సిబ్బంది అప్రమ‌త్తం  :  కొల్లాం - చెన్నై ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ కు త‌ప్పిన ముప్పు

తమిళనాడులోని  కొల్లాం- చెన్నై ఎగ్మూర్ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. S3  కోచ్ బేస్ వద్ద పగుళ్లు ఏర్పడినట్లుగా రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రయాణికులను పక్కనే ఉన్న మరో కోచ్‌కి తరలించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టారు. ఆ బోగీని రైలు నుండి వేరు చేసి ఆ బోగీకి కొత్త కోచ్‌ను చేర్చారు.  దీంతో రైలు బయలుదేరడానికి గంట ఆలస్యమైంది.  

 ఎగ్మూర్ఎక్స్‌ప్రెస్  కొల్లం నుంచి చెన్నైకి 2023 జూన్ 05న ఆదివారం రోజున బయలుదేరింది.  రైలు సాయంత్రంసెంగోట్టై స్టేషన్‌కు చేరుకున్నాక.. S3  కోచ్ బేస్ వద్ద పగుళ్లు ఏర్పడినట్లుగా రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే రైల్వే  అధికారులకు సమాచారం అందించారు. దీంతో హడావుడిగా రైలును అక్కడే నిలిపివేసి చర్యలు చేపట్టారు.  గంట ఆలస్యం తర్వాత ట్రైన్ ముందుకు వెళ్లింది.  పగుళ్లను గుర్తించి అప్రమత్తమైన సిబ్బందికి అభినందనలు తెలుపుతామని మదురై డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌ వెల్లడించారు.  

ఒడిశాలోని బాలాసోర్‌లో 2023  జూన్ 02 రోజున ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి  తెలిసిందే.  . మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో రెండు వందల మందికి పైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.