కరీంనగర్ టౌన్/కొత్తపల్లి, వెలుగు: టెన్త్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు రికార్డుస్థాయి మార్కులతో విజయభేరి మోగించారు. బుధవారం సిటీలోని వావిలాలపల్లి ‘అల్ఫోర్స్ టైనిటాట్స్’ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆర్. సాత్విక్ 589 మార్కులతో టాపర్‌గా నిలిచాడని తెలిపారు. ఒ. ఆద్య, టి. రాజు, బి. అక్షిత్ రెడ్డి 588 మార్కులతో సత్తా చాటారని చెప్పారు. పరీక్షలకు హాజరైన 1,274 మంది విద్యార్థుల్లో, 1,026 మంది 500కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా సాధించారని పేర్కొన్నారు. 334 మంది విద్యార్థులు 560 మార్కుల మైలురాయిని దాటారని వెల్లడించారు. పటిష్టమైన ప్రణాళికలు, విద్యార్థుల కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో అల్ఫోర్స్ విద్యా విధానం కొనసాగుతోందని వివరించారు. ప్రతి ఏటా అద్భుత ఫలితాలను సాధించడం తమ విద్యా విధానానికి నిదర్శనమన్నారు.

