తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లిని కాబోతున్నానని ఆలియా భట్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈమేరకు ఆలియా ఒ ఫోటోను కూడా షేర్ చేసింది. ''మా బేబీ... త్వరలో రాబోతుంది'' అని హాస్పిటల్ లో ర‌ణ్‌బీర్‌తో ఉన్న ఫొటోకు కామెంట్స్ రాసింది. 

ఇక ఆలియా, రణ్‌బీర్ పేరెంట్స్ కాబోతున్నారని ప్రకటించిన వెంటనే ఈ జంటకు పలువురు సెలెబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ఈ వార్త విన్న చాలా మంది షాక్ అవుతూ చిత్ర విచిత్రమైన కామెంట్లను పెడుతున్నారు. దీంతో ఆలియా భట్ ప్రెగ్నెన్సీ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. 

ఈ బాలీవుడ్ జంట దాదాపు ఐదేళ్ల లవ్ ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఎప్పుడో వివాహం చేసుకోవాల్సింది.. కానీ కొన్ని కారణాల వల్ల వివాహం తరచూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 14వ తేదీన ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెద్దల సమక్ష్యంలో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. అలియా, ర‌ణ్‌బీర్ జంటగా 'బ్రహ్మాస్త్ర' మూవీలో నటిస్తున్నారు.. రణ్‌బీర్ 'షంషేరా', 'యానివల్' చిత్రాల్లో చేస్తున్నాడు. ఇక ఆలియా 'డార్లింగ్స్', 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' వంటి చిత్రాలతో బిజీగా ఉంది.