కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?

కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పలువురు ముఖ్య నేతలు కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలతోపాటు పలువురు నేతలు బీజేపీ చేరారు. ఇక చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇక, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ జనవరల్ సెక్రటరీ కే కేశవరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కేటీఆర్ ప్రధాన అనుచరుడు అలిశెట్టి అరవింద్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేకేను రాజకీయ గురువుగా భావించే అరవింద్.. ఆయన పార్టీ మారుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అరవింద్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొదటి నుంచి బీఆర్ఎస్, కేటీఆర్ వెంట ఉన్న అరవింద్.. ప్రస్తుతం రాష్ట్రంలో నెల్లొన్న పరిస్థితుల క్రమంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి.. పార్టీ మారనున్నట్లు సమాచారం.

ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ లోకి  వెళ్లనున్నట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన క్రమంలో బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో కడియం ఉన్నట్లు సమాచారం. వరంగల్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన కూతురు కావ్య తప్పుకుంటున్నట్లు ప్రకటించిన క్రమంలో కడియం పార్టీ మారడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి.