గద్వాల ఆర్డీవో గా అలివేలు బాధ్యతలు

గద్వాల ఆర్డీవో గా అలివేలు బాధ్యతలు

గద్వాల టౌన్, వెలుగు: గద్వాల ఆర్డీవోగా అలివేలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొన్ని రోజులుగా ఆర్డీవో పోస్ట్​ ఖాళీగా ఉంది. వరంగల్  గ్రేటర్  మున్సిపల్  కార్పొరేషన్  డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్న అలివేలును ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఆమె ఇన్​చార్జి ఆర్డీవో శ్రీనివాసరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అడిషనల్  కలెక్టర్  లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు