హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మహిళలకు వ్యతిరేకమని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడు తూ.. తెలంగాణలో గత 3 నెలల నుంచి 19 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించా మని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మహిళా నేతల కోసం సెప్టెంబర్‌లో రెండ్రోజుల శిక్షణా కార్యక్ర మాలు ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు చిన్న పిల్లలపై అత్యాచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 25న ఢిల్లీలో భారీ ధర్నా చేస్తున్నామని వెల్లడించారు.
