ఆదివాసీ ఎరుకలకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి..

ఆదివాసీ ఎరుకలకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి..

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ ఎరుకల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆరోపించారు. ఆదివారం లోయర్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

1956 నుంచి ఇప్పటి వరకు లంబాడి, కోయ, గోండు తెగలకే అధిక ప్రాధాన్యం లభిస్తుండగా, ఆదివాసీ ఎరుకలను మాత్రం పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ ఎరుకలకు న్యాయం జరగాలంటే జాతీయ ఎస్టీ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్ చైర్మన్ పదవిని ఆదివాసి ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ తరఫున చట్టసభల్లో మాట్లాడే ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందడం లేదని పేర్కొన్నారు.