రామాయంపేట, వెలుగు : ఓ లోకో పైలెట్ రెడ్ సిగ్నల్ ను గమనించిన ట్రైన్ ను ప్లాట్ ఫామ్ మీదికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో అటు వైపు మరో ట్రైన్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లా అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నాందేడ్ నుంచి మేడ్చల్ వెళ్లే డెమో ట్రైన్ ఆదివారం ఉదయం అక్కన్నపేటకు చేరుకుంది.
స్టేషన్ రాక ముందే.. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ దానిని గమనించని లోకో పైలెట్ ట్రైన్ ను ప్లాట్ ఫాంపైకి తీసుకొచ్చాడు. అయితే ఆ సమయంలో అటు వైపు ఎలాంటి రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఆఫీసర్లు స్టేషన్ కు చేరుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. సుమారు రెండు గంటల తర్వాత మరో లోకో పైలెట్ సాయంతో ట్రైన్ ను అక్కడి నుంచి పంపించి వేశారు.
