రామాలయ దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే.. హోసబలే వ్యాఖ్యలతో ఏకీభవించిన మోహన్ భాగవత్

రామాలయ దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే.. హోసబలే వ్యాఖ్యలతో ఏకీభవించిన మోహన్ భాగవత్

నాగ్‌‌‌‌పూర్: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో దోషులకు కఠిన శిక్ష పడాలని ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఆదివారం ప్రకటించారు. సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "హోసబలే ప్రకటనను చూడండి... నా స్పందన కూడా అదే" అని పేర్కొన్నారు. ఆ ప్రకటనలో అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని హోసబలే డిమాండ్ చేశారు.