హైదరాబాద్‌సిటీ, వెలుగు: చిన్న వయస్సు నుంచే కార్టూన్లు గీస్తూ 11 ఏండ్లకే 100కి పైగా కార్టూన్లతో బుక్ పబ్లిష్చేసిన శ్రీయాన్‌ను ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ అభినందించి, సత్కరించారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌కు చెందిన శ్రీయాన్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు.
చిన్నప్పటి నుంచే కార్టూన్లు వేయడంపై ఆసక్తి చూపిస్తున్న ఈ బాలుడుతాజాగా కార్టూన్లతో ‘బ్రోచేవారెవరురా బ్రో.. నను’ పేరిట బుక్ తీసుకువచ్చాడు. దాన్ని కేటీఆర్‌కు బహూకరించాడు. శ్రీయాన్తండ్రి రమేశ్శ్రీరంగం ప్రముఖ మ్యాక్స్ఫేషియలిస్ట్కాగా, తల్లి న్యాయవాదిగా ప్రాక్టీస్చేస్తున్నారు.
