KPHBలోని లులు మాల్లో 50 శాతం డిస్కౌంట్ సేల్

KPHBలోని లులు మాల్లో 50 శాతం డిస్కౌంట్ సేల్

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్బీలోని లులు మాల్లో ఈ నెల 9వ తేదీ నుంచి 50 డిస్కౌంట్​సేల్​ప్రారంభం కాబోతున్నది. దానికి సంబంధించిన లోగో, టీషర్ట్ ను ఆదివారం హీరో శ్రీనందు ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 9 నుంచి 12వ వరకు లులు ఆన్ సేల్ పేరిట 50 శాతం డిస్కౌంట్​తో సేల్​కొనసాగుతుందన్నారు.

హైపర్​మార్కెట్​లో గ్రాసరీస్​, ఫ్యాషన్​, ఎలక్ర్టానిక్స్, హోంనీడ్స్​తో పాటు 25 వేలకు పైగావస్తువులపై ఈ డిస్కౌంట్​వర్తిస్తుందన్నారు. గేమ్స్​జోన్​లో కూడా 100 శాతం బోనస్​సెలబ్రేషన్​ఆఫర్​ ఉందన్నారు. 

మెగా సేల్లో 200కు పైగా బ్రాండ్స్​ పాల్గొంటున్నాయని, కనీసం రూ. 2999 షాపింగ్​చేస్తే లక్కీ డ్రాలో హ్యుండ్య్​ ఐ 20 కారు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. లులు హ్యాపినెస్ లోయాలిటీ కస్టమర్లకు 8వ తేదీ నుంచే సేల్ యాక్సెస్ ఉంటుందన్నారు.

ఈ నాలుగు రోజులు ఉదయం 9 గంటలకే ఓపెన్​చేస్తామని చెప్పారు. ఆర్ఎం మహమ్మద్ షరీఫ్​, మేనేజర్​ఏజిల్​అరసన్, డీజీఎం విశాల్​కుమార్, ఫాంటురా అసిస్టెంట్​మేనేజర్​సూర్యకాంత్, మార్కెటింగ్​మేనేజర్లు ఫణి, మను ఆంథోని పాల్గొన్నారు.