ఫ్రోజెన్ సెమెన్ స్ట్రా ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

ఫ్రోజెన్ సెమెన్ స్ట్రా ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూక్​నగర్ మండలంలోని కంసాన్​పల్లిలో నిర్మించిన పశువుల ఘనీకృత వీర్య నాళికల(ఫ్రోజెన్ సెమెన్ స్ట్రా) ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని  మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే శంకర్ తో కలిసి సెంటర్​ను పరిశీలించారు.

పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు కేంద్రం నిర్మాణం, సదుపాయాలు, లక్ష్యాలను వారికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఫ్రోజెన్ సెమెన్ స్ట్రా ఉత్పత్తి కేంద్రం అందుబాటులోకి వస్తే మేలు జాతి పశువుల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందన్నారు. రూ.21 కోట్లతో అన్ని హంగులతో ఈ సెంటర్​ను సిద్ధం  చేస్తున్నామని, త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.