సాగర్‌లో అభ్యర్థుల వేటలో ఆల్ పార్టీలు

సాగర్‌లో అభ్యర్థుల వేటలో ఆల్ పార్టీలు

సాగర్‌లో హీటెక్కిన పాలిటిక్స్

కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డికి లైన్ క్లియర్

టీఆర్ఎస్ నుంచి ‘నోముల’ ఫ్యామిలీకి ఇచ్చే ఛాన్స్

ఆల్టర్నేట్​గా మరికొందరి పేర్లను పరిశీలిస్తున్న హైకమాండ్

బోణీ కొట్టేందుకు ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్న బీజేపీ

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్  బై పోల్స్​ కోసం అన్ని పొలిటికల్​ పార్టీ లు క్యాండిడేట్ల వేటలో పడ్డాయి. ఎప్పుడు ఎలక్షన్​ నోటిఫికేషన్ వచ్చినా రెడీగా ఉండేందుకు వీలుగా క్యాండిడేట్ల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా సీక్రెట్​ సర్వేలు చేయిస్తున్నాయి. ప్రధానంగా పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం హైకమాండ్​కు ప్రెస్టీజ్​ ఇష్యూగా మారింది. ఈ క్రమంలో ఓవైపు ఇంటెలిజెన్స్​వర్గాల నుంచి రిపోర్ట్ లు తెప్పించుకుంటూనే మరోవైపు నియోజకవర్గంలో బల మైన సామాజిక వర్గాల నాడిని పట్టేందుకు ప్రైవేటు ఏజెన్సీలను రంగంలో కి దింపింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి మరోసారి పోటీలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఇటీవలే ఆయన స్పష్టం చేయడంతో క్యాడర్​లో కన్ఫ్యూజన్​ తగ్గింది.  దుబ్బాక, జీహె చ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఈ ఉపఎన్నికలోనూ తన బలాన్ని చాటుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకుపోతోంది. ఈ బైపోల్స్​లో గెలిచి ఉ మ్మడి జిల్లాలో బోణీ కొట్టాలని కాషాయపార్టీ ఉవ్విళ్లూరుతోంది.

టీఆర్​ఎస్​లో ‘లోకల్’ డిమాండ్..

టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఫ్యామిలీకి టికెట్ ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎమ్మె ల్యే క్యాండిడేట్ ఎవరనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. నర్సింహ య్య సతీమణి లక్ష్మికి టికెట్ ఇస్తారా..? లేదంటే ఆయన కుమారుడు భ గత్​కు అవకాశం కల్పిస్తారా..? అన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు. సర్వే మాత్రం నర్సిం హయ్య సతీమణి పేరుతోనే చేస్తున్నట్లు తెలిసింది. వీరితో పాటు రాజ్యస భ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి ప్రముఖుల పేర్లు సైతం హైకమాండ్​ పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నా రు. నియోజకవర్గంలో నెలకొన్న గ్రూపు పాలిటిక్స్​కు పుల్​స్టాప్​ పెట్టాలంటే స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ అక్కడి నేతల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో రూలింగ్ పార్టీ తలపెట్టిన ఈ సర్వేలో యాదవ, రెడ్డి కు లాలకే టాప్ ప్రియారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

విజయంపై కన్నేసిన బీజేపీ..

బైపోల్స్‌లో బీజేపీ క్యాండిడేట్ ఎవరేనది ఆసక్తికరంగా మారింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీ నెక్స్ట్ టార్గెట్ నాగార్జునసాగర్ కావడంతో
బీజేపీ ఏదోఒక అద్భుతం సృష్టిస్తుందనే ప్రచారం జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ లో లక్షా79వేల 955 ఓట్లు పోలైతే బీజేపీకి కేవలం 2వేల675 ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ వేవ్ బలంగా వీస్తున్న క్రమంలో నాగార్జునసాగర్ ఎన్నికను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని పార్టీ సీనియర్ నేత కడారి అంజయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి హైకమాండ్ పెద్దలను కోరినట్లు తెలిసింది. కానీ పార్టీ మాత్రం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. రెండు పార్టీలకు గట్టిపోటీ ఇచ్చేలా టీఆర్ఎస్‌లోని ‘రెడ్డి’ సామాజికవర్గం నేతలతో టచ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కాంగ్రెస్ నుంచి ‘జానా’ క్లియర్!

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. నాగార్జునసాగర్​లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి స్టేట్​లో రికార్డు సృష్టించిన జానారెడ్డి గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే తిష్టవేసిన ఆయన స్థానిక ప్రజలతో సంబం ధాలు కొనసాగిస్తున్నారు. నర్సింహయ్య మరణం తర్వాత ఇటీవల కాలం లో తన యాక్టివిటీని మరింత స్పీడప్​ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్​లో చేరే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిన ఆయన.. ఉప పోరులో బరిలో ఉండేది తానేని సంకేతాలు ఇచ్చారు. ఆయన కుమారుడు రఘు వీర్​రెడ్డి  పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఈ ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్​గా మారిన నేపథ్యంలో జానారెడ్డి పోటీకి దిగడం అనివార్యమని ఆ పార్టీ లీడర్లు అంటున్నారు. ఉమ్మ డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు సైతం బైపోల్​లో జానారెడ్డిని గెలిపిస్తామని ఇటీవలే శపథం కూడా చేశారు.

For More News..

ఆర్టీసీ బకాయిలు ఇప్పట్లో ఇవ్వకపోవచ్చు!

రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్​తో గందరగోళం.. పొద్దంతా సర్వర్‌‌ తిప్పలు

60 ఏళ్లు దాటిన రైతులకు 3వేల పెన్షన్​ ఇచ్చే ఆలోచనలో కేంద్రం