ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ 42 ఏళ్లకే హార్ట్ అటాక్తో మృతి

ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ 42 ఏళ్లకే హార్ట్ అటాక్తో మృతి

ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేత ప్రశాంత్ తమంగ్ (42) ఆదివారం (జనవరి 11న) గుండెపోటుతో చనిపోయాడు. హార్ట్ అటాక్ రావడంతో అతనిని ద్వారకలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇండియన్ ఐడల్ ఆడిషన్‌కు ముందు తమంగ్ కోల్‌కతా కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు.

కోల్‌కతా పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఇండియన్ ఐడల్ ఛాంపియన్‌గా ప్రశాంత్ తమంగ్ జర్నీ స్పూర్తిదాయకంగా నిలిచింది. ఇండియన్ టీవీ హిస్టరీలో తమంగ్ జర్నీ అత్యంత స్ఫూర్తిదాయకమైన విజయగాథలలో ఒకటిగా నిలిచింది. అతని వినసొంపైన గాత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది.

పశ్చిమ బెంగాల్, నేపాల్‌లో అతనికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. తమంగ్ నటుడిగా కూడా రాణించాడు. నేపాలీ చిత్రాలలో నటించాడు. తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు. ప్రశాంత్ భార్య గీతా థాపా, కుమార్తె అరియా 2011లో నాగాలాండ్‌లో వివాహం చేసుకున్నారు. తమంగ్ అకాల మరణం అతని అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. లక్షలాది మంది హృదయాల్లో తీరని లోటుని మిగిల్చింది.