కత్తి కూడా ఇంతలా కోయదేమో.. హైదరాబాద్లో చైనా మాంజా చుట్టుకుని హాస్పిటల్ పాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగి

కత్తి కూడా ఇంతలా కోయదేమో.. హైదరాబాద్లో చైనా మాంజా చుట్టుకుని హాస్పిటల్ పాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగి

చైనా మాంజాపై పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించినా.. వినియోగం మాత్రం ఆగడం లేదు. వ్యాపారులు రహస్యంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటుంటే.. సామాన్యులు అది చేసే గాయాలకు ఆస్పత్రుల పాలవుతూనే ఉన్నారు. ఆదివారం (జనవరి 11) హైదరాబాద్ లో చైనా మాంజా చుట్టుకుని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరాడు. 

గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో  చైతన్య (27) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు బైకుపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి తెగిన గాలి పటం మాంజా చుట్టుకుంది. చెయ్యి కోసుకుపోవడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది.

గాయాలతో విలవిలలాడుతున్న చైతన్యను స్థానికులు హస్పటల్ కు తరలించారు.  ప్రస్తుతం ఉద్యోగి మాదాపూర్ లోని ప్రైవేట్ హస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు.  చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని.. గాలిపటం ఎగరేస్తున్న పిల్లల ద్వారా మాంజా అమ్ముతున్న వ్యాపారులను పట్టుకుంటే నిషేధించడం సులువని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.