పాత లీడర్లు ఒక్కటైతున్రు

పాత లీడర్లు ఒక్కటైతున్రు
  • వచ్చే ఎన్నికలే లక్ష్యంగా విభేదాలు వీడుతున్న నేతలు
  • నేతి విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్త్ డే వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే వీరేశం
  • మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి బ్రదర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనూ సాన్నిహిత్యం

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార పార్టీకి చెందిన పాత లీడర్లంతా ఒక్కటవుతున్నారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్న ఈ పరిణామాలు జిల్లాలో హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకే టికెట్లు ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గతంలో కత్తులు దూసుకున్న నేతలంతా ఇప్పుడు ఏకతాటిపైకి రావడం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం విభేదాలను పక్కన పెట్టి పాత మిత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఇప్పటికే యాదాద్రి జిల్లాలో బూర నర్సయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాల వారీగా తన సామాజిక వర్గానికి చెందిన లీడర్లతో పాటు, గత ఎన్నికల్లో గెలుపోటములకు కారకులైన లీడర్లతో భేటీ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వీరేశం సైతం పాత విషయాలను పక్కన పెట్టి సంధి మార్గాన్ని ఎంచుకున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే...

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్న వేముల వీరేశం ఇప్పటి నుంచే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గతంలో పట్టించుకోని సీనియర్లతో ఇప్పుడు కలిసిపోతున్నారు. వీరేశం నకిరేకల్‌‌ ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే బూర నర్సయ్యగౌడ్‌‌ భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఇద్దరి మధ్య విభేదాలు ఉండడంతో బూర నర్సయ్యగౌడ్‌‌ నకిరేకల్‌‌ నియోజకవర్గంలో పర్యటించాలంటేనే ముందూ వెనుకా ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒక్కతాటిపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆయన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డితో కూడా వీరేశానికి సాన్నిహిత్యం ఉంది. ఇది చిట్యాల మండలంలో కలిసివస్తుందన్న ప్రచారం జరుగుతోంది. వీరేశం చొరవతోనే భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చారని, అప్పటినుంచి కంచర్ల బ్రదర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వీరేశానికి మంచి సంబంధాలు ఉన్నాయని చెపుతుంటారు.

చేతులు కలిపిన విద్యాసాగర్, వీరేశం

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతి విద్యాసాగర్, వేముల వీరేశం చేతులు కలపడంతో నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి లోనయ్యారు. బుధవారం విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే సందర్భంగా వీరేశం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పిన వీరేశం, ఆ తర్వాత విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటికి ర్యాలీగా వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో వీరేశానికి వ్యతిరేకంగా విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గం పనిచేసినట్లు ప్రచారంలో ఉంది. పైగా వీరేశం ఓడిపోయాక, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రప్పించడంలో విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకపాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వీరేశం చేతులు కలపడం గమనార్హం. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీల్లో చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవుల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే మళ్లీ పాత మిత్రుల కలయికకు దారితీసినట్లు చర్చ జరుగుతోంది. పైగా ఎమ్మెల్యే భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి శత్రువును దెబ్బతీసేందుకే ఈ కలయిక అని ఆ పార్టీ లీడర్లు 
చర్చించుకుంటున్నారు.

బూర నర్సయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక దృష్టి

గత ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ తగ్గిన నియోజకవర్గాలపైన బూర నర్సయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. నకిరేకల్, భువనగిరి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఆయనకు మెజార్టీ తగ్గింది. ముఖ్యంగా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనుకున్నంత మెజార్టీ రాలేదు. దీంతో ఆయన నియోజకవర్గాల వారీగా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెడుతున్నారు. మండల అధ్యక్షులు, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో నిత్యం టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నారు. ఎమ్మెల్యేలపైనే ఆధారపడి, క్షేత్రస్థాయి నాయకత్వంపైన దృష్టి పెట్టకపోవడమే గత ఎన్నికల్లో ఓటమి కారణమని భావించిన బూర నర్సయ్య ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నాలుగైదు నెలల్లో పూర్తిస్థాయి కార్యాచరణతో రంగంలోకి దిగుతారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.