ఓలా ఫ్యాక్టరీలో వర్కర్స్ అంతా మహిళలే

ఓలా ఫ్యాక్టరీలో వర్కర్స్ అంతా మహిళలే

అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు ఇప్పుడు ఆటోమొబైల్‌‌ ఇండస్ట్రీలో  అడుగుపెట్టారు. తాము ఏ పనైనా చేయగలమని మరోసారి నిరూపించారు. ఎన్విరాన్‌‌మెంట్‌‌కి మంచి చేసేందుకు ఓలా తీసుకొచ్చిన ఈ – స్కూటర్ల  ప్రొడక్షన్‌‌లో భాగమవ్వనున్నారు. 

క్యాబ్‌‌ సేవల్లో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్‌‌ స్కూటర్లను రిలీజ్‌‌ చేసింది. ఎలక్ట్రిక్‌‌ స్కూటర్ల తయారీ కోసం బెంగళూరు దగ్గర్లో నిర్మించిన ‘ఓలాఫ్యూచర్‌‌ ఫ్యాక్టరీ’లో అందరూ మహిళలనే ఎంప్లాయిస్‌‌గా తీసుకోవాలనుకుంది ఓలా. దీంతో ఆ ఫ్యాక్టరీ మొత్తం మహిళల చేతుల్లో ఉంటుంది. దాదాపు పదివేల మందికిపైగా మహిళలు ఈ – స్కూటర్ల తయారీలో భాగస్వామ్యం కానున్నారు. దానికోసం మొదటి బ్యాచ్‌‌ మహిళలకు సోమవారం కంపెనీ  ఆహ్వానం పలికింది. ప్రపంచంలోనే ఎక్కువమంది మహిళలు ఉన్న ఫ్యాకర్టీగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఆటోమొబైల్‌‌ ఇండస్ట్రీలో మహిళలు ఉన్న ఏకైక ఫ్యాక్టరీ కూడా ఇదే. మహిళలతో కలిసి దిగిన ఒక జిఫ్‌‌ను, వాళ్లు తమ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ షేర్‌‌‌‌ చేస్తున్న వీడియోను ఆయన ట్వీట్‌‌ చేశాడు. ఓలా కో - ఫౌండర్‌‌‌‌, సీఈవో భవిష్‌‌ అగర్వాల్‌‌.