మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని వర్క్స్​​ కంప్లీట్ చేయాలి: జి. రవినాయక్

మహబూబ్ నగర్  మున్సిపాలిటీ పరిధిలో అన్ని వర్క్స్​​ కంప్లీట్ చేయాలి: జి. రవినాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్  మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్  జి. రవినాయక్  ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన వర్క్స్​పై ఇంజనీరింగ్  అధికారులు, ఏజెన్సీలు, మున్సిపల్ అధికారులతో వీసీ నిర్వహించారు. సీడీపీ, ఎస్పీఎఫ్​ తదితర పథకాల కింద చేపట్టిన పనులపై ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ ఇంజనీరింగ్  ఏజెన్సీల వారిగా సమీక్షించారు. 

ALSO READ : టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి: అనుముల సురేశ్

కళాభారతి, స్లాటర్ హౌస్, వెజ్, నాన్ వెజ్  మార్కెట్లు, జంక్షన్ల డెవలప్ మెంట్​ తదితర పనులపై రివ్యూ చేశారు. అడిషనల్ కలెక్టర్​ యాదయ్య, మున్సిపల్  కమిషనర్  ప్రదీప్ కుమార్  పాల్గొన్నారు.