గద్వాల, వెలుగు : ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం 76 మందికి షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో అమలవుతున్న ఫేస్ రికగ్నైజ్ హాజరు విధానాన్ని పరిశీలించిన కలెక్టర్..
యాప్‌లో సక్రమంగా నమోదు చేయడం లేదని గుర్తించారు. దీంతో జిల్లాలోని 61 స్కూల్స్‌కు చెందిన 76 మంది బోధన, బోధనేతర సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి స్కూల్‌లో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్‌ను తప్పనిసరిగా పాటించాలని, ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
