నాగర్ కర్నూల్, వెలుగు : అరుదైన చారిత్రక శిల్పాలకు నెలవైన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, సభ్యులు యాదేశ్వర్ దండేతికర్, కిరణ్ గౌడ్ గ్రామంలోని శివాలయ పరిసరాల్లోని 14వ శతాబ్దానికి చెందిన మూడు అరుదైన చారిత్రక విగ్రహాలను గుర్తించారు.
చారకొండ మండల కేంద్రంలో 14వ శతాబ్దానికి చెందిన సప్త మాతృకలు, రాష్ట్ర కూటశైలికి చెందిన పండితగల్లు శిల్పం, కాకతీయ శిలవైభవానికి చెందిన తాంత్రిక భైరవమూర్తి విగ్రహాలను గుర్తించారు. చెక్కుచెదరని విగ్రహాలలో అద్భుతమైన శిల్పకళ ఉట్టిపుడుతుందన్న వారు 14,15వ శతాబ్దాలకు చెందిన ఈశిల్పంలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవడం విశేషమన్నారు.
