Allu Arjun Pushpa 2: చేతిలో గొడ్డలితో సింహాసనంపై పుష్పరాజ్..తగ్గేదేలే అవతారం అదిరిపోయింది

Allu Arjun Pushpa 2: చేతిలో గొడ్డలితో సింహాసనంపై పుష్పరాజ్..తగ్గేదేలే అవతారం అదిరిపోయింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa2). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukunar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కారణంగా..పార్ట్ 2పై రోజురోజుకి హైప్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటోంది.అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఎక్కడ రాజీపడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ అప్డేట్ తో పూనకాలు తెప్పిస్తున్న మేకర్స్..తాజాగా పుష్ప 2 లో నుంచి అల్లు అర్జున్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్తో నేషనల్ వైడ్గా పూనకాల వైబ్ షురూ కాబోతుంది.ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్..ఆ స్వాగ్ తో పాటు..చేతిలో గొడ్డలి పట్టుకుని సింహాసనంపై కూర్చున్న పుష్పరాజ్ అవతారం అదిరిపోయింది.ఈ పోస్టర్ ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతోంది. 

ఇక పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే..ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా..రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి