helicopter crashes:హెలికాప్టర్ క్రాష్ లాండింగ్..పైలట్ సేఫ్..

helicopter crashes:హెలికాప్టర్ క్రాష్ లాండింగ్..పైలట్ సేఫ్..

నేపాల్​ లో హెలికాప్టర్ కుప్పకూలింది. బుధవారం ( అక్టోబర్​29) హిమాలయ పర్వత ప్రాంతాల్లోని సొలుఖుంబ్​ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్​ ల్యాండింగ్​ అయింది. ఈ ప్రమాదంలో పైలట్​ సేఫ్​ గా బయటపడ్డాడు. 

ఉదయం విదేశీ పర్యాటకులను తీసుకెళ్లేందుకు లుక్లా నుంచి బయలుదేరిన హెలికాప్టర్ లోబుచే హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవుతుండగా మంచు మీద జారిపడటంతో ప్రమాదం జరిగింది. 

ప్రమాద సమయంలో హెలికాప్టర్​ లో ఉన్న కెప్టెన్​ వివేక్​ ఖడ్కా కు గాయాలయ్యాయి. మరో ఎయిర్ హెలికాప్టర్ లో లుక్లాకు తరలించారు. భారీగా మంచు పడటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.