ఖాళీ స్థలంలో 10 బిల్డింగ్స్, 80 ఫ్లాట్స్ ఉన్నట్లు ఇంటి నెంబర్లు...ఇది అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నిర్వాకం

ఖాళీ స్థలంలో 10 బిల్డింగ్స్, 80 ఫ్లాట్స్ ఉన్నట్లు  ఇంటి నెంబర్లు...ఇది అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నిర్వాకం

అల్వాల్ లో ఖాళీ స్థలానికి ఇంటినెంబర్లు కేటాయించి అడ్డంగా దొరికాడు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. ఏకంగా 10 భారీ బిల్డింగ్స్ ..వాటిలో 80 ఫ్లాట్స్ ఉన్నట్లు నంబర్లు కేటాయించాడు. అంతేగాకుండా ఫేక్ ఇంటి నంబర్లతో ప్రాపర్టీ ట్యాక్స్  నంబర్స్ కేటాయించాడు. విజిలెన్స విచారణలో అడ్డంగా దొరికాడు. 

మరో వైపు అక్రమాలకు పాల్పడ్డ అల్వాల్  డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలకు సిద్దమైన  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్..విజిలెన్స్ విచారణ చేయించి రిపోర్ట్ తెప్పించుకున్నారు. 

అల్వాల్ లో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించినట్లు విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూమికి సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా 10 పెద్ద బిల్డింగ్స్ ఉన్నట్లు.. వాటిలో 80 ఫ్లాట్స్ ఉన్నట్లు ఇంటి నంబర్స్ కేటాయించాడు డీసీ. అల్వాల్ లోని 573,574 సర్వే నంబర్స్ లో ఖాళీ స్థలానికి ఇంటి నంబర్స్ కేటాయించి ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్ ను కేటాయించాడు.  ఇంటి నెంబర్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్కెచ్ వేశాడు. డీసీ శ్రీనివాస్ రెడ్డిపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, స్టేట్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు మోహన్ రెడ్డి. విచారణలో నిజమని తేలడంతో ఫేక్ ఇంటి నెంబర్లతో కేటాయించిన ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్ రద్దు చేశారు  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.