రాజధాని రగడ.. ఐదోరోజు రైతుల నిరసనలు

రాజధాని రగడ.. ఐదోరోజు రైతుల నిరసనలు

ఏపీ రాజధానిపై నిరసనలు హోరెత్తుతున్నాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో 29 గ్రామాల రైతులు నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాజధానిని తరలించవద్దని డిమాండ్  చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని తరలిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.వెలగపూడిలో ఐదో రోజు రైతుల రిలేనిరాహార దీక్ష కొనసాగుతుంది.పలువురు రాజకీయ నేతలకు కూడా రైతులకు మద్దతు తెలుపుతున్నారు.

మందడం మండలంలో రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై పడవ పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. అయితే పోలీసులు వచ్చి పడవను తీసేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విట్ కాలేజ్ విద్యార్థులు  రైతుల దీక్షకు మద్దతు తెలిపారు. తమ భవిష్యత్తు కోసం రైతులుభూములిస్తే ఇపుడు అందకారంలోకి నెడుతున్నారన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు రైతులకు మద్దతు తెలుపుతామన్నారు.