రాహుల్ కంటే క్రేజ్ పెరిగిందనే కెప్టెన్‌ను తొలగించారు

రాహుల్ కంటే క్రేజ్ పెరిగిందనే కెప్టెన్‌ను తొలగించారు

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. తదుపరి సీఎం ఎవరనే విషయంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే టైమ్‌లో అమరిందర్ సింగ్ రాజీనామా విషయాన్ని హైలెట్ చేస్తూ కాంగ్రెస్‌ మీద బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. గాంధీల కంటే అమరిందర్ సింగ్‌కే ఎక్కువ పాపులారిటీ ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కెప్టెన్ అమరిందర్ సింగ్ ఓ పాపులర్ లీడర్ అని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంటే అమరిందర్‌కు పాపులారిటీ ఎక్కువగా పెరుగుతుండటంతోనే ఆయనను తొలగించారని ఆరోపించారు. ఇకపోతే, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు సునీల్ జాఖర్, సుఖీందర్ సింగ్ రన్‌ధావా, త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, బ్రహ్మ మోహింద్రా, విజయేందర్ సింగ్లా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రాలు పంజాబ్ సీఎం రేసులో ఉన్నారని సమాచారం.